![]() |
![]() |

సినిమా రంగంలో 'ట్రోల్ల్స్'(Troll)అనేవి నిత్య సాధారణం. వీటికి బాషా బేధం కూడా లేదు. ఒక హీరోల అభిమానులు ఇంకో హీరోపై ద్వేషంతో ట్రోల్స్ చేస్తుంటారు. వాళ్ళందరు నిజమైన అభిమానులా అంటే అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఒక రేంజ్ లోనే ట్రోల్స్ చేస్తుంటారు. వాటి వల్ల ట్రోల్స్ చేసే వాళ్ళకి, ఎంత ఆనందమొస్తుందో తెలియదు కానీ, అభిమానులు ఎంతగానో బాధపడుతుంటారు. హీరోలు కూడా తమపై వచ్చే ట్రోల్స్ కి బాధగా ఉందని వెల్లడి చేసిన సందర్భాలని కూడా చూస్తూనే ఉన్నాం.
రీసెంట్ గా ధనుష్(Dhanush)తన అప్ కమింగ్ మూవీ 'ఇడ్లీ కొట్టు'(Idli Kottu)ఆడియో లాంచ్ లో ట్రోల్స్ వెనక ఉన్న అసలు రహస్యాన్ని చెప్పాడు. ఆయన మాట్లాడుతు ఇండస్ట్రీ లో 'హేటర్స్' అనే కాన్సెప్ట్ లేనే లేదు. ట్రోల్స్ చేసే వాళ్ళు అందరి హీరోల సినిమాలు చూస్తారు. ఎవరో ముప్పై మంది ఒక టీంగా ఏర్పడి మూడు వందల ఫేక్ ఐడి లని క్రియేట్ చేసుకొని వారి మనుగడ కోసం హీరోలోపై కావాలని ద్వేషం క్రియేట్ చేస్తున్నారు. బయట కనిపించే వాటికి రియాలిటీ కి చాలా తేడా ఉంటుందని ధనుష్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.
ఇక ఇడ్లి కొట్టులో 'ధనుష్' సరసన 'నిత్య మీనన్'(Nithya Menen)జత కడుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో 'తిరు' మూవీ వచ్చి ఘన విజయాన్ని అందుకోవడంతో ఇడ్లి కొట్టు పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పైగా ఆ ఇద్దరి పై తెరకెక్కిన 'మేఘం కరుకాత' సాంగ్ కి నేషనల్ అవార్డు రావడంతో 'ఇడ్లీ కొట్టు' ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. అక్టోబర్ 1 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా, తెలుగు రిలీజ్ కి సంబంధించిన హక్కుల కోసం ప్రముఖ పంపిణి సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇడ్లి కొట్టుకి ధనుష్ నే దర్శకుడు కావడం ప్రధాన ఆకర్షణ. ధనుష్ రీసెంట్ గా 'కుబేర' తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

![]() |
![]() |