![]() |
![]() |

కన్నడ స్టార్ హీరో 'ఉపేంద్ర'(UPendra)రీసెంట్ గా రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ 'కూలీ'(Coolie)లో గెస్ట్ రోల్ లో కనిపించాడు. రోల్ చిన్నదైనా యాక్షన్ సీక్వెన్స్ లో మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. రీసెంట్ గా 'ఉపేంద్ర' ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో 'నా భార్య ప్రియాంక(Priyanka)ఆన్ లైన్ లో ఒక వస్తువు ఆర్డర్ చేసింది. ఇందుకు సంబంధించి ఈ రోజు ఉదయం నా భార్య ఫోన్ నెంబర్ కి ఒక వ్యక్తి కాల్ చేసాడు. కొన్ని హ్యాష్ టాగ్స్, నంబర్లు ఎంటర్ చేస్తే డెలివరీ అవుతుందని చెప్పిన వెంటనే ఫోన్ హ్యాక్ అయ్యింది.
ఆ తర్వాత నా ఫోన్ కూడా హ్యాక్(hack)అయ్యింది. మా నంబర్స్ నుంచి కానీ, సోషల్ మీడియా అకౌంట్ నుంచి మెసేజెస్ వస్తే స్పందించవద్దు. డబ్బులు కావాలని అడిగినా పంపించవద్దు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయబోతున్నాం. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అభిమానులకి,ప్రజలకి పిలుపు ఇస్తూ ట్వీట్ చేసాడు.
ఫోన్ హ్యాకింగ్ అనేది చాలా కాలం నుంచి పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వాలు, సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు వీటిని నిరోధిస్తున్నా కూడా,కొత్త పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చెయ్యడంలో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. ఉపేంద్ర ప్రస్తుతం పలు కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులో 'రామ్ పోతినేని'(Ram Pothineni)హీరోగా వస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra KIng Taluka)లో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. నవంబర్ 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |