![]() |
![]() |

కొంతమంది 'హీరోయిన్లు' సిల్వర్ స్క్రీన్ పై రెగ్యులర్ గా కనిపించకపోయినా, ఆమె సృష్టించిన ప్రభంజనం తాలూకు ప్రభావం ప్రేక్షకుల్లో మెదులుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఒకరు 'మీనా'(Meena). బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన 'మీనా' తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సరసన జత కట్టడంతో పాటు, ఎన్నో చిన్న చిత్రాలు పెద్ద స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారకురాలిగా నిలిచింది. సహజత్వంతో కూడిన నటన మీనా సొంతం. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే 2009 లో బెంగుళూరు కి చెందిన వ్యాపారవేత్త 'విద్యా సాగర్' ని వివాహం చేసుకోగా, అనారోగ్య కారణాలతో 2022 లో ఆయన మరణించడం జరిగింది. వీరిద్దరికి 'నైనికా' అనే పాప ఉంది.
మీనా రీసెంట్ గా జగపతిబాబు(Jagapathi Babu)హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమురా'(Jayammu Nischayammu Raa)ప్రోగ్రాం కి హోస్ట్ గా హాజరయ్యింది. ఈ సందర్భంగా ఆమె తన సినీ, వ్యక్తిగత జీవితాల గురించి పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది. ఆమె మాట్లాడుతు 'నా భర్త చనిపోయిన వారం రోజుల తర్వాత నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎందుకు ఇలా రాస్తున్నారు. వాళ్ళకి కుటుంబాలు ఉండవా అని బాధపడేదాన్ని. పైగా ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని రాసేవారు. దీంతో ఏం చెయ్యాలో తెలిసేది కాదు. సినిమాల పరంగా చూసుకుంటే చాలా మంది నిర్మాతలు మేము ప్లాప్ ల్లో ఉన్నామని, తక్కువ అమౌంట్ తో సినిమా ప్లాన్ చేశామని సంప్రదించే వారు. దాంతో రెమ్యునరేషన్ చూసుకోకుండా చేసే దాన్ని. సినిమా హిట్ అయ్యాక మాత్రం నన్ను మర్చిపోయేవారు. పాప పుట్టిన రెండేళ్ళకి 'దృశ్యం' సినిమా కోసం సంప్రదించారు. పాపని వదిలి వెళ్లలేక తిరస్కరించాను. కానీ నన్ను దృష్టిలో పెట్టుకునే 'దృశ్యం' కథ సిద్ధం చేశామని చెప్పడంతో దృశ్యం చెయ్యాల్సి వచ్చిందని మీనా చెప్పుకొచ్చింది.
దృశ్యం తొలుత మలయాళంలో తెరకెక్కగా అందులో 'రాణి జార్జ్' క్యారక్టర్ లో మీనా అద్భుతంగా నటించింది. తెలుగులో కూడా 'మీనా' నే ఆ క్యారక్టర్ ని పోషించి చిత్ర విజయంలో బాగస్వామ్యమయ్యింది. మీనా ఇప్పటి వరకు తెలుగు,తమిళ, మలయాళ భాషలు కలుపుకొని సుమారు 200 చిత్రాల్లో నటించింది. గత ఏడాది 'ఆనందాపురం డైరీస్ అనే మలయాళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న తన సినీ కెరీర్ లో పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సైతం అందుకుంది. తెలుగులో 2021 లో విడుదలైన దృశ్యం 2 లో చివరిసారిగా కనపడగా, ఈ చిత్రం కోవిడ్ నేపథ్యంలో డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యింది.
![]() |
![]() |