![]() |
![]() |

హీరోయిన్ కాజల్ అంటే ఏమనుకుంటున్నారు.. ఏదో సినిమా హీరోయిన్ లే.. సినిమాల్లో నటించడం,తన రెమ్యునరేషన్ తీసుకోవడం, అవసరమైతే ప్రమోషన్స్ లో పాల్గొనడం. ఇంకా అవసరమైతే యాడ్స్ లో చేసీ డబ్బు సంపాదించడం అనుకుంటున్నారా! తనలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అది నేడు బయటపడింది.
మే 13 న ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసారు. ఈ రోజు ఫలితాలు వచ్చాయి. బాలయ్య, పవన్ ఇద్దరు భారీ మెజారిటీతో విజయం సాధించారు.. ఈ సందర్భంగా కాజల్ ఆ ఇద్దరికి అభినందలు తెలుపుతు విడి విడిగా ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారూ మీ విజయానికి అభినందనలు. మీ అవిశ్రాంత కృషికి అచంచలమైన నిబద్ధత నిజంగా ఫలించింది. అలాగే బాలకృష్ణ ని ఉద్దేశించి విజయం సాధించినందుకు అభినందనలు బాలకృష్ణ గారు.. మీ కృషి అంకితభావం మరియు విజన్ మీకు సామూహికంగా ఈ అసమానమైన ప్రేమను సంపాదించిపెట్టాయి అని ట్వీట్ చేసింది. ఇలా ఇద్దర్ని విడివిడిగా అద్భుతమైన మాటలతో ట్వీట్ చెయ్యడం ఇరువురి అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది. ఇక ప్రముఖ హీరో సుధీర్ బాబు కూడా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు లకి విషెస్ చెప్పాడు. తన ట్విట్టర్ లో ఆ ఇద్దరి ఫొటోస్ పెట్టి మరి కంగ్రాట్స్ చెప్పాడు.


![]() |
![]() |