![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)అసెంబ్లీ లో అడుగుపెట్టాలన్నది అయన అభిమానుల కోరిక. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం వచ్చింది. పైగా 70000 కి పైగా మెజారిటీ రావడంతో ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక తాజాగా ఒక వీడియో ఒకటి వాళ్ళల్లో మరింత జోష్ ని తెస్తుంది.
పవన్ కళ్యాణ్ గెలవడంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పవన్ ఇంటికి చేరుకున్నారు. దాంతో పవన్ భార్య అన్నా లెజ్నోవా(anna lezhneva) కుమారుడు అకీరా నందన్(akira nandan) బయటకి వచ్చి కార్యకర్తలకు అభివాదం. చేసారు. దీంతో వాళ్ళ ఆనందం రెట్టింపు అయ్యింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జిందాబాద్ స్థానంలో పిఠాపురం ఎంఎల్ఏ పవన్ కళ్యాణ్ జిందా బాద్ అనే నినాదాలు మిన్నట్టుకుంటున్నాయి.
![]() |
![]() |