![]() |
![]() |

ఈషా రెబ్బా.. అచ్చ తెలుగు నటి .. అందానికి అందం, అంతే అందమైన నటనతో ప్రేక్షక హృదయాల్లో చాలా బలంగానే నాటుకుపోయింది. 2012 నుంచి సినిమాలు చేసుకుంటు వస్తుంది. సుమారు పద్దెనిమిది సినిమాల దాకా తన ఖాతాలో ఉన్నాయి. ఈమె తాజాగా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి
ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబో లో 2018 లో అరవింద సమేత వచ్చింది. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి త్రివిక్రమ్ మ్యాజిక్ తోడవ్వడంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఈషా నటించింది. హీరోయిన్ గా చేసిన పూజాహెగ్డే చెల్లెలు సునంద క్యారక్టర్ ని పోషించింది. అంతగా ప్రాధాన్యత లేని ఆ క్యారక్టర్ లో తన వరకు బాగానే చేసింది. ఇప్పుడు ఆ విషయం మీదే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడింది. అరవింద సమేత లో యాక్ట్ చేసేందుకు తొలుత ఆసక్తి చూపలేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఓకే చెప్పాను. నాది ప్రధాన పాత్రే అని దర్శక నిర్మాతలు చెప్పారు. పైగా సినిమాలో సెకండ్ లీడ్ క్యారక్టర్ అని చెప్పారు.ఈ విషయాన్ని రిలీజ్ కి ముందు అనౌన్స్ కూడా చేస్తామన్నారు.ఆ విధంగా జరిగి ఉంటే నా కెరీర్ కి అరవింద హెల్ప్ అయ్యి ఉండేది. పైగా నాతో తెరకెక్కించిన కొన్ని సీన్స్ కూడా కట్ చేసారు. ఎన్టీఆర్ కి నాకు ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. అది కూడా జరగలేదని చెప్పింది.అయితే వీటన్నింటికి కారణమేంటో తనకు తెలియదని, ఈ రోజుకి బాధ పడుతున్నాను. అయితే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ లతో పని చేయడం మాత్రం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది

ఇక ఈషా రెబ్బా తన పన్నెండేళ్ల కెరీర్ లో చేసిన మొట్టమొదటి పెద్ద సినిమా అరవింద సమేత నే. మూవీ కోసం బైక్ రైడింగ్ కూడా నేర్చుకుంది. మూవీ చూస్తున్నంత సేపు కూడా పూజా చెల్లెలుగా ఈషా చెయ్యడం ఏంటని అనిపిస్తుంది.ఎందుకంటే హీరోయిన్ గా అప్పుడప్పుడే సినిమాలు చేసుకుంటు వెళ్తుంది. ఏది ఏమైనా ఒప్పుకొని చేసింది తనే.గత సంవత్సరం మామ మచ్చింద్ర తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరికొన్ని అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వెబ్ సిరీస్ లోను తన సత్తా చాటుతు ముందుకు దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్ లో ఉంది
![]() |
![]() |