![]() |
![]() |
తెలుగుతోపాటు పలు సౌతిండియన్ భాషల్లో సినిమాలతో, సీరియల్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న రాధిక కాలికి గాయం కావడంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది. తమిళ్‌లో సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో కూడా నటించారు రాధిక. అంతేకాదు, రాడాన్ పేరుతో ఓ సంస్థ స్థాపించి దాని ద్వారా ఎన్నో సీరియల్స్ నిర్మించారు. సినిమాల కంటే సీరియల్స్ ద్వారానే తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది రాధిక. ఇటీవల ఈమెను పరామర్శించేందుకు ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ ఆమె నివాసానికి వెళ్లారు. తమిళ్ హీరోలు సూర్య, కార్తీ ఇద్దరూ శివకుమార్ తనయులేనన్న విషయం తెలిసిందే.
శివకుమార్‌ను అన్నయ్యగా భావించే రాధిక.. ఆయన తన ఇంటికి రావడంతో ఎంతో ఎమోషనల్ అయ్యారు. రాధిక తండ్రి ఎం.ఆర్.రాధ కూడా ప్రముఖ నటుడేనన్న విషయం తెలిసిందే. శివకుమార్‌కి సమకాలీనుడైన ఎం.ఆర్.రాధ కుమార్తె రాధిక అంటే శివకుమార్‌కి కూడా ఎంతో అభిమానం. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో సీరియల్స్‌లో నటించారు. ఎక్కువగా అన్నాచెల్లెళ్ళ క్యారెక్టర్స్‌లోనే కలిసి నటించారు. దీంతో తనను కలిసేందుకు శివకుమార్ రావడంతో తన అన్న ఇంటికి వచ్చాడంటూ ట్వీట్ చేశారు రాధిక. ఆయన ఉన్న కాసేపు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఫోటో ఆల్బమ్స్ చూస్తూ గడిపారు. దీనికి సంబంధించి రాధిక వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![]() |
![]() |