![]() |
![]() |

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న సీరియల్ నటుడు చందు(chandu) ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. త్రినయని, కార్తీక్ దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ చందు కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినయని సీరియల్ నటి పవిత్ర (pavitra) తో చందుకు ఆరేళ్లుగా అనుబంధం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పవిత్ర మృతిని తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకొని ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. చందుకు భార్య శిల్ప ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్కూల్ డేస్ నుంచే ఇద్దరి ప్రేమించుకున్నారు. ఇరు వైపులా పెద్దల్ని ఒప్పించి 2015లో వివాహం చేసుకున్నారు. త్రినయని సీరియల్ లో నటించడం చందు ప్రారంభించిన దగ్గరనుంచి శిల్ప కి అతనికి మధ్య గొడవలు జరుగుతుండేవి. డైవర్స్ ఇచ్చేయమని శిల్పని వేధించేవాడు.
20 ఏళ్ల పై వయసున్న పవిత్ర పిల్లలని తన పిల్లలు అని వాళ్ళ కాలేజీల్లో తండ్రి స్థానంలో సంతకాలు కూడా చేశాడు. కానీ సొంత బిడ్డల ప్రోగ్రెస్ కార్డులో ఏ రోజు సంతకం చేయలేదు. పిల్లల మొహం కూడా చూడలేదు. పెద్ద పాప మూడవ తరగతి చిన్నబాబు ఎల్కేజీ.ఇక చందు పవిత్ర నివసిస్తున్న ప్లాట్ లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు , పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
![]() |
![]() |