![]() |
![]() |
ఈ సమ్మర్ ఎండిరగ్‌లో అందరిలోనూ వేడి పుట్టిస్తున్న సినిమా ‘కల్కి 2898ఎడి’. పాన్ ఇండియా హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఎవరూ ఊహించని స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘కల్కి’కి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. ఇప్పటివరకు ఈ సినిమా సంబంధించి ఇచ్చిన అప్‌డేట్స్ అన్నీ ఎంతో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసేలా ఉన్నాయి. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కుతునన ‘కల్కి’ భారతీయ సినిమాలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ సినిమాలోని ప్రభాస్ చేస్తున్న భైరవ గెటప్‌ని రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను భారీగా పెంచేశారు. మే 18 సాయంత్రం 5 గంటలకు భైరవకి సంబంధించిన వాహనం బుజ్జి రోల్‌ను రిలీజ్ చెయ్యబోతున్నారు. ‘డార్లింగ్స్.. నా బుజ్జిని కలిసేందుకు మిమ్మల్ని వెయిట్ చెయ్యనివ్వలేను’ అంటూ ప్రభాస్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారుతోంది. స్క్రాచ్ ఎపిసోడ్ 4 పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ని ఈ నెలాఖరులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి హేమాహేమీలు నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
![]() |
![]() |