![]() |
![]() |

నిన్నగాక మొన్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్ ఆక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. పవిత్ర చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకాంత్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆరేళ్లుగా త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్‌తో సహజీవనం చేస్తున్నాడు . ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన కారులో చంద్రకాంత్ కూడా ఉన్నాడు. ఐతే అతను గాయాలతో బయటపడ్డాడు.

కానీ పవిత్ర తన కళ్ల ముందే ప్రాణాలు వదలటాన్ని జీర్ణించుకోలేక మనోవేదనకు గురయ్యాడు. అప్పటినుంచి డిప్రెషన్ లోకి వెళ్లిన చంద్రకాంత్ ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు. రెండు రోజుల కిందట పవిత్ర పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్ డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ ఆమె జ్ఞాపకాలను ఇన్ స్టాలో పోస్ట్ చేసి బాధపడుతూనే ఉన్నాడు చంద్రకాంత్. ఇక ఈరోజు కూడా.. "గుడ్ మార్నింగ్ నాన్న.. ఇట్స్ టైమ్ ఫర్ జిమ్.. మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు.. లవ్ యూ పాపా.." అంటూ చందు వరుస పోస్టులు పెడుతూ వస్తున్నాడు. పవిత్ర చనిపోలేదని.. తమ మధ్యే ఉందని ఎమోషనల్ అయ్యాడు ఒక ఇంటర్వ్యూలో . ఐదారేళ్లుగా పవిత్ర, చంద్రకాంత్ కలిసే ఉంటున్నారు. అయితే.. తమ మధ్య ఉన్న ఈ బంధాన్ని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామని.. ఐతే ఇంతలోనే ఇలా జరిగిందంటూ చంద్రకాంత్ భావోద్వేగానికి లోనయ్యాడు.
![]() |
![]() |