![]() |
![]() |

తెలుగు సినిమాకి ,నటనకి గాడ్ ఫాదర్ ఎవరంటే మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు. ఆయన రాకతోనే హీరోకి గుర్తింపు వచ్చింది. 1941 నుంచి 2014 వరకు నటిస్తు ఉన్నారంటే ఆయన నట స్టామినా ని అర్ధం చేసుకోవచ్చు. ఆయన నటించిన ఆఖరి చిత్రం మనం..ఎనభై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఎంతో చలాకీగా నటించి ఏఎన్ఆర్ ని తలదన్నే నటుడు లేడనే మాటకి శాశ్వత స్థానాన్ని కూడా కలిపించాడు. ఇప్పుడు ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మే 23 ,2014 న మనం రిలీజ్ అయ్యింది. అంటే మరికొన్ని రోజుల్లో పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా మూడు తరాలకి చెందిన హీరోలంతా కలిసి పోటాపోటీగా నటించారు. నటించారు అనే కంటే జీవించారు అని చెప్పవచ్చు. పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మే23న రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో అక్కినేని అభిమానుల్లో పండుగ వాతావరణం వచ్చింది

సినిమా విడుదలపై అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో థియేటర్లలో మరోసారి సెలబ్రేట్ చేసుకుందాం అని ట్వీట్ వచ్చింది. అలాగే నాగ చైతన్య కూడా పది సంవత్సరాల వేడుకలను థియేటర్స్ లో జరుపుకుందాం. ఏ ఎన్ ఆర్ లైవ్స్ అంటు ట్వీట్ చేసాడు. అన్నపూర్ణ స్టూడియోస్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన మనం కి విక్రమ్ కుమార్ దర్శకుడు. అక్కినేని నాగేశ్వరావు తండ్రిగా నాగార్జున, నాగార్జున తండ్రిగా నాగ చైతన్య, ఆ ముగ్గరిని కాపాడే వ్యక్తిగా అఖిల్ మనం లో నటించారు
![]() |
![]() |