![]() |
![]() |
నటసింహ నందమూరి బాలకృష్ణ.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా మూడు బ్లాక్‌బస్టర్స్‌తో హ్యాట్రిక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది అభిమానుల నుంచి. మూడు వరస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న బాలయ్య ఇప్పుడు నాలుగో సినిమాను పూర్తిగా కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో మరో కొత్త బాలయ్య కనిపిస్తాడు అంటున్నారు. బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన బాబీ ఇప్పుడు బాలయ్యతో మరో భారీ విజయాన్ని అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు.
బాలకృష్ణ చేసే ప్రతి సినిమాలో అతని గెటప్ బాగా ప్లస్ అవుతుంది. గెటప్ అదిరిండంటే.. సినిమా అంతకు మించి అదురుతుంది. ఇది అతని గత చిత్రాలను గమనిస్తే తెలుస్తుంది. బాలయ్య కొత్త సినిమా చేస్తున్నాడు అంటే అందులో అతని గెటప్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే కుతూహలం అభిమానుల్లో ఉంటుంది. అయితే ఇప్పటివరకు బాలయ్య, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కొత్త లుక్‌ని రిలీజ్ చెయ్యలేదు. కానీ, సినిమాలో బాలయ్య లుక్ ఎలా ఉండబోతుందనే విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది. రీసెంట్‌గా బాలయ్య కొత్త స్టిల్స్ బయటికి వచ్చాయి. అయితే అవి బాలకృష్ణ కొత్త సినిమాకి సంబంధించిన స్టిల్స్ కావు. అయినా ఆ సినిమాలో బాలకృష్ణ గెటప్ ఎలా ఉంటుందనేది తెలిసింది. ఈ లుక్‌లో బాలయ్య ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడని అభిమానులు ఎంతో ఆనందంగా చెబుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చెయ్యాలన్నది మేకర్స్ ప్లాన్.
![]() |
![]() |