![]() |
![]() |
సినిమాల్లో సాహసాలు చేసే హీరోలను మనం చూస్తుంటాం. అతను చేసే విన్యాసాలకు చప్పట్లు కొడతాం, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న హీరోకు ఫిదా అయిపోతాం. మరి నిజజీవితంలో అలాంటి సాహసాలు చేసేవారు ఎంతమంది? ఆపదలో ఉన్నవారిని కాపాడేవారు ఎంతమంది? దీనికి సమాధానం అప్పుడప్పుడు వార్తల రూపంలో మనం వింటూనే ఉంటాం. అలాంటి ఓ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన ‘యానిమల్’ చిత్రంలో నటించిన మన్జోత్ ఎంతో సాహసంతో, సమయస్ఫూర్తితో ఓ అమ్మాయి ప్రాణాలు కాపాడాడు. దాంతో అక్కడి వారంతా అతన్ని హీరోని చేసేశారు. అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
వివరాల్లోకి వెళితే మన్జోత్ చదువుకుంటున్న కాలేజీలోని 18 ఏళ్ళ యువతి కొన్ని కారణాల వల్ల కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బిల్డింగ్ పై నుంచి దూకేందుకు సిద్ధంగా ఉన్న ఆ అమ్మాయిని కాపాడేందుకు బిల్డింగ్ కింద, బిల్డింగ్ పైన చాలా మంది యువకులు చేరుకున్నారు. ఆ సమయంలో ఎంతో సమయస్ఫూర్తితో డేరింగ్‌గా బిల్డింగ్ చుట్టూ ఉన్న గోడవెంట పరిగెత్తుకెళ్ళి ఆ అమ్మాయిని ఆఖరి క్షణంలో జారి పడిపోతుండగా టక్కున ఓ చేతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో ఆ అమ్మాయి అతని చేతి ఆధారంగానే వేలాడిరది. అదే సమయంలో మిగతా యువకులు కూడా దగ్గరికి వచ్చి ఆ యువతిని పైకి లాగారు. దీంతో ఓ సూసైడ్‌ను ఆపినట్టయింది. ప్రాణాలు తీసుకోవాలనుకున్న యువతిని కాపాడిన ‘యానిమల్’ యాక్టర్ మన్జోత్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు. అతను కాలేజ్ డేస్‌కి సంబంధించింది. ఆ అమ్మాయిని కాపాడినందుకుగానూ అప్పటి ఢల్లీి సిఖ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ మంజీత్ సింగ్ జీకే మన్జోత్ను మెచ్చుకున్నారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు అతడికి అయ్యే మొత్తం ఖర్చుల్ని భరిస్తామని హామీ ఇచ్చారు.
![]() |
![]() |