![]() |
![]() |

ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకున్న నటి ఇలియానా(Ileana)తెలుగు సినిమా రంగంలో హీరోలతో పాటు క్రేజ్ ని సంపాదించిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి మెంబర్ ఆఫ్ సినిమాలు చేసినా కూడా ఇలియానాకి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అమెరికా కి చెందిన మైఖేల్ డోలాన్ ( Michael Dolan) ని ప్రేమించిన ఇలియానా అతని ద్వారా గత ఏడాది అగస్ట్ లో ఒక బిడ్డకి జన్మనిచ్చింది.ఇప్పుడు ఇలియానా తాజాగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇలియానా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా పెళ్లిపై చాలా పుకార్లు వస్తున్నాయి. ఆ విషయంపై నేను క్లారిఫై ఇవ్వాలిసిన అవసరం లేదు. నా గురించి ఎవరేమి అనుకున్నా పర్లేదు. కానీ నా పార్టనర్ మైకేల్ డోలాన్ ని గాని అతని ఫ్యామిలీ గురించి గాని మాట్లాడితే మాత్రం నాకు కోపం వస్తుందని చెప్పుకొచ్చింది. వీటితో పాటు తల్లి అయ్యాక ఆడవాళ్లు డిప్రెషన్ లోకి వెళ్ళే మాట నిజమే అని కూడా చెప్పింది.

ఇలియానా ప్రస్తుతం మైఖేల్ అండ్ తన కొడుకు కోవా ఫీనిక్స్ డోలాన్ తో కలిసి అమెరికాలో ఉంటుంది. 2021 లో వచ్చిన బిగ్ బుల్ మూవీ ఆమె చివరిగా నటించిన మూవీ. సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఇలియానా చెప్పిన మాటలు విన్న కొంత మంది అయితే డోలాన్ కి తనకి పెళ్లి జరిగిందనే జరగలేదనో చెప్పచ్చుగా అని అంటున్నారు.
![]() |
![]() |