![]() |
![]() |

2006 లో వచ్చిన మాయాజాలం అనే మూవీతో తెలుగు సినీ పరిశ్రమలో తళుక్కుమన్న ముద్దుగుమ్మ పూనమ్ కౌర్( poonam kaur)తెలుగులో సుమారు 20 చిత్రాలకి పైగానే నటించిన పూనమ్ కి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. కానీ తన పర్సనల్ విషయాలకి సంబంధించిన వాటిలో మాత్రం పూనమ్ బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె త్రివిక్రమ్( trivikram) గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ హీరోగా గుంటూరు కారం( guntur kaaram) అనే మూవీని తెరకెక్కించాడు.ఈ నెల 12న రిలీజ్ అవుతున్న గుంటూరుకారం ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచన రాణి రచనలో వచ్చిన కీర్తి కిరీటాలు (keerthi keratalu) అనే నవల ఆధారంగా తెరకెక్కిందనే వార్త హల్ చల్ చేస్తుంది. ఇప్పుడు ఈ విషయంపైనే పూనమ్ తన ట్విట్టర్ వేదికగా త్రివిక్రమ్ ఏదైనా చెయ్యగలడు అలాగే తన తప్పుడు పనులు ప్రజలకి కనపడకుండా తనకున్న నైపుణ్యంతో ఆ విషయాలని కవర్ చెయ్యగలడు అని ట్విటర్ లో పోస్ట్ చేసింది.
అంతే కాకుండా గత ప్రభుత్వంలో త్రివిక్రమ్ సిఎం కార్యాలయానికి వెళ్ళాలి అనుకుంటే నిమిషాల వ్యవధిలో వెళ్లగలడు తనకి అది ఎలా సాధ్యమవుతుందో నాకు ఇప్పటికి అర్ధం కాదు అని కూడా ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
![]() |
![]() |