![]() |
![]() |
ప్రస్తుతం మీడియా కంటే పవర్‌ఫుల్‌గా మారిపోయింది సోషల్ మీడియా. ఏ విషయం మీదైనా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సినిమా తారల విషయానికి వస్తే వారి పర్సనల్ వ్యవహారాల్ని కూడా పబ్లిక్ చేయగల సత్తా సోషల్ మీడియాకి ఉంది. దీని గురించి కోలీవుడ్ హీరో ధనుష్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి టైమ్‌ని వేస్ట్ చేసే సాధనం అని ధనుష్ అభిప్రాయ పడుతున్నారు. అందరూ దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను, ఆడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ ‘నలుగురు స్నేహితులు కలుసుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు చూస్తూ మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేగానీ, మొబైల్స్ చూస్తూ మాట్లాడుకోవడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి ఎలా అయ్యిందంటే ప్రతి విషయాన్ని ఇకపై దాని ద్వారానే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేన్నయినా అవసరానికి మించి ఉపయోగించడం అంత మంచిది కాదు’ అన్నారు.
‘కెప్టెన్ మిల్లర్’ దర్శకుడు అరుణ్ మాధేశ్వరన్ మాట్లాడుతూ ధనుష్ కోసం రెండు కథలు రెడీ చేసానని, అయితే అతనితో సినిమా తీసే అవకాశం రాలేదని అన్నారు. మూడోసారి వినిపించిన ఈ కథ ఆయనకు వెంటనే నచ్చిందని, వెంటనే ఓకే చెప్పారని అన్నారు. అలాగే ధనుష్‌తో సినిమా చేస్తున్నానని చెప్పగానే మరో మాట మాట్లాడకుండా శివరాజ్‌కుమార్‌గారు ఓకే చెప్పారని అన్నారు.
![]() |
![]() |