![]() |
![]() |

సినిమా రాజకీయ క్రీడా వ్యాపార రంగాల్లో ఉన్న సెలెబ్రిటీస్ లాగానే జ్యోతిష్యుల్లో కూడా సెలెబ్రిటీస్ ఉన్నారు. అది ఎవరో కాదు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈయన తరచూ సినిమా వాళ్ళ జీవితంలో జరగబోయే విషయాల గురించి ముందుగానే చెప్తుంటాడు. ఈయన చెప్పే ఆ విషయాలన్ని కూడా సంచలనం సృష్టిస్తాయి. తాజాగా వేణు స్వామి రష్మిక, విజయ్ దేవరకొండ ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంచి కాక రేపుతున్నాయి.
వేణు స్వామి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు విజయ్ దేవరకొండ రష్మిక లు పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ తర్వాత విడిపోతారని చెప్పాడు అంతే కాకుండా ఈ విషయాన్ని నేను గతంలో రష్మిక కి చెప్పానని అలాగే విజయ్ ని ఎట్టిపరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోవద్దని కూడా చెప్పానని చెప్పుకొచ్చాడు. కానీ నేను చెప్పిన విషయం రష్మిక కి నచ్చలేదు. ఇక అంతే అప్పటివరకు నా మీద నమ్మకంతో నేను చెప్పిన పూజల్ని పరిహారాలని చేస్తుండే రష్మిక ఇక నాతో మాట్లాడటం మానేసిందని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వేణు స్వామి ఇంటర్వ్యూ సంచలనం సృష్టిస్తుంది.

వేణు స్వామి గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి తర్వాత ఇక సినిమా కెరీర్ ఉండదని చెప్పాడు. ఇప్పుడు సలార్ రికార్డు కలెక్షన్స్ ని సృష్టించే పనిలో బిజీ గా ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామి ని ట్రోల్ చేసే పనిలో బిజీ గా ఉన్నారు.
![]() |
![]() |