![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవలే పదిహేను వారాల పాటు తెలుగు ప్రజలందరినీ ఎంతగానో అలరించింది. ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన షో లో ఎంతో మంది కంటెస్ట్ లు పాల్గొని తెలుగు వాళ్లందరికీ దగ్గరయ్యారు. ఇంటిల్లిపాదికి ఎంతో ఆనందాన్నిస్తున్న బిగ్ బాస్ కి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు తమ షో కి సంబంధించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.
ఇక మీదట బిగ్ బాస్ షో లో విన్నర్ గా నిలిచిన వ్యక్తి ఎలాంటి ర్యాలీలు చెయ్యకూడదు. బిగ్ బాస్ షో యాజమాన్యం ఈ నిర్ణయాన్ని చాలా ఖచ్చితంగా అమల్లోకి తీసుకురానుంది. సీజన్ 8 ప్రారంభం కావడానికి ముందే అందరి కంటెస్ట్ ల చేత ఈ మేరకు హామీ పత్రం కూడా తీసుకుంటారు. సోషల్ మీడియాలో బిగ్ బాస్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ బిగ్ బాస్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ విజయం సాధిస్తే అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు.ఈ మేరకు వీళ్ళిద్దరని ప్రకటించే సమయంలో ఇరువురి అభిమానులు బిగ్ బాస్ షో జరిగే అన్నపూర్ణ స్టూడియో దగ్గరకి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సమయంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ ని ఇబ్బందికి గురి చెయ్యడంతో పాటుగా ప్రభుత్వ ఆస్తులకి నష్టం కూడా కలిగించారు. ఆ క్రమంలో పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ కూడా చేసారు.
![]() |
![]() |