![]() |
![]() |

విక్టరీ వెంకటేష్,మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు సినిమాలకి సంబంధం లేకుండా చాలా మంచి స్నేహితులు. తమ తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకి కూడా ఇరువురు హాజరవుతుంటారు. అలాగే వీలు కుదిరినప్పుడల్లాఒకరికొకరు కలుసుకొని పర్సనల్ విషయాలని కూడా చర్చించుకుంటారు. తాజాగా చిరంజీవి గురించి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
వెంకటేష్ తన సినీ జర్నీలో 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఒక ఈవెంట్ జరిగింది. ఆద్యంతం కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వెంకటేష్ మెగాస్టార్ ని ఉద్దేశించి మాట్లాడుతు చిరంజీవి గారు లేకుంటే నేను సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లి ఉండే వాడినని కానీ 9 సంవత్సరాల విరామం తర్వాత కూడా ఆయన ఖైదీ నంబర్ 150 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నేను నా నటనని ఆపకుండా కొనసాగిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

వెంకటేష్ తన 75 వ చిత్రంగా సైంధవ్ అనే మూవీ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13 న పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతున్న ఈ మూవీ మీద వెంకటేష్ అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.శ్రద్ద శ్రీనాధ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు కాగా వెంకట్ బోయినపల్లి నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.
![]() |
![]() |