![]() |
![]() |
.webp)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రేస్టీజియస్ట్ మూవీ దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర ఎప్పుడెప్పుడు షూటింగ్ ని పూర్తి చేసుకొని తమ ముందుకు వస్తుందా అని నిత్యం దేవర నామ జపం చెయ్యని ఎన్టీఆర్ అభిమాని లేడు. పైగా ఈ మూవీ నుంచి మొట్టమొదటి సారి సముద్రం మధ్యలో చిన్న నాటు పడవ మీద చేతిలో ఒక పెద్ద బల్లెం లాంటిది పట్టుకొని సీరియస్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాంతో నిత్యం దేవరకి సంబంధించిన పోస్టర్స్ గాని వార్తలు గాని వస్తు ఉండాలని అభిమానులు భావిస్తు వచ్చారు. కానీ కొన్ని రోజుల నుంచి దేవరకి సంబంధించిన నయా అప్ డేట్ ని మేకర్స్ ప్రకటించటంలేదు. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక వార్త అభిమానుల్లో జోష్ ని తెప్పిస్తుంది.
వచ్చే జనవరి 8 న అభిమానుల కోసం చిత్ర యూనిట్ సినిమాకి సంబందించిన ఒక అదిరిపోయే ట్రీట్ ని ఇవ్వబోతుంది. ఆ రోజున దేవర కి సంబంధించిన కొన్ని గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు.ఈ మేరకు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం జనవరి 8 న ఎన్టీఆర్ అభిమానులకి దేవర నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజులు ఆగితే గాని అసలు విషయం తెలియదు. ప్రస్తుతానికి అయితే సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కింగ్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువ సుధా ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ లు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5 2024 న విడుదల కానుంది.
![]() |
![]() |