![]() |
![]() |

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'యానిమల్'. డిసెంబర్ 1న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ రూ.800 కోట్లకు పైగా గ్రాస్ తో సంచలనం సృష్టించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సినిమా అభిమానులకు దర్శకుడు సందీప్ రెడ్డి ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివితో వచ్చిన సినిమాల్లో యానిమల్ ఒకటి. ఈ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 21 నిమిషాలు. అయినప్పటికీ ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే థియేటర్ లోనే ఎక్కువ నిడివితో విడుదలైంది అంటే.. ఓటీటీలో ఇంకా ఎక్కువ నిడివితో విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డి చెప్పాడు. థియేటర్ వెర్షన్ కంటే 8 నిమిషాల ఎక్కువ నిడివితో ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని తెలిపాడు. కాగా యానిమల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సంక్రాంతి నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |