![]() |
![]() |

ఒకప్పుడు రూ.100 కోట్ల గ్రాస్ రావడమే గొప్ప. అలాంటిది ఇప్పుడు కొందరు స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ కి ఇది చాలా సాధారణ విషయం అయిపోయింది. మొదట బాహుబలి-2 తో ఈ ఫీట్ సాధించిన ప్రభాస్.. ఆ తర్వాత సాహో, అదిపురుష్, సలార్ సినిమాలతో.. మొత్తం నాలుగు సార్లు ఈ ఫీట్ సాధించాడు. మిగతా ఏ తెలుగు హీరో కూడా ఇప్పటిదాకా ఈ ఫీట్ సాధించలేదు. ఆర్ఆర్ఆర్ కూడా మొదటిరోజు వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినప్పటికీ.. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలు ఉన్నారు. అందుకే ప్రభాస్ తర్వాత సోలోగా మొదటి రోజే రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టగలిగే తెలుగు హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
ఈ తరంలో టాలీవుడ్ లో ప్రభాస్ తో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లను టాప్ స్టార్స్ గా పరిగణిస్తుంటారు. ప్రభాస్ లాగే మొదటి రోజే రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టగలిగే సత్తా ఈ ఐదుగురు స్టార్స్ లో ఉంది. అయితే ముందు ఎవరు ఈ ఫీట్ సాధిస్తారనేదే విషయం.
పవన్ కళ్యాణ్ నుండి ఇంతవరకు పాన్ ఇండియా సినిమా రాలేదు. పైగా రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో ఓజీ మూవీ ఎప్పుడొచ్చినా ఈ ఫీట్ సాధిస్తుందనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది.
మహేష్ బాబు నుండి కూడా ఇంతవరకు పాన్ ఇండియా మూవీ రాలేదు. ప్రస్తుతం గుంటూరు కారంలో నటిస్తున్న ఆయన, ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. రాజమౌళి ప్రాజెక్ట్ అంటే.. మొదటిరోజు 100 ఏంటి, 200 కోట్లు అయినా వస్తాయి అనడంలో ఆశ్చర్యంలేదు. మరి దానికంటే ముందే ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో ఈ ఫీట్ సాధించి మహేష్ సర్ ప్రైజ్ చేస్తాడేమో చూడాలి.
ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పుష్పతో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2 చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం.. మొదటి రోజు వంద కోట్లకు పైగా రాబడుతుంది అనడంలో సందేహం లేదు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యతో నిరాశపరిచిన రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. చరణ్, శంకర్ కాంబినేషన్ పై నెలకొన్న హైప్ దృష్ట్యా ఈ సినిమా సంచలన ఓపెనింగ్స్ రాబట్టే అవకాశముంది.
![]() |
![]() |