![]() |
![]() |

సరైన సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తానని 'సలార్'తో మరోసారి రుజువు చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఫిల్మ్ డిసెంబర్ 22న విడుదలై ఫస్ట్ డే సంచలన కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.
సలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.178.7 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రకటించిన హోంబలే ఫిలిమ్స్, రెండో రోజు రూ.117 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అనౌన్స్ చేసింది. దీంతో రెండో రోజుల్లో రూ.295.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

![]() |
![]() |