![]() |
![]() |

డింపుల్ హయతి.. ఈ పేరు చెప్తే కుర్రకారు మొత్తానికి చెమటలు పట్టాలసిందే. ఎందుకంటే రవితేజ హీరోగా వచ్చిన రావణాసురలో ఆమె ప్రదర్శించిన అందాలని అంత త్వరగా వాళ్ళు మర్చిపోలేరు. ఆ తర్వాత గోపిచంద్ సరసన రామ బాణం లో కూడా నటించి ఇక తన కోసం అయినా ప్రేక్షకులు థియేటర్ల కి వచ్చేలా చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
మహేష్ లేటెస్ట్ మూవీ గుంటూరు కారంలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ లో డింపుల్ హయతి తన అంద చందాలని ప్రదర్శించబోతుంది. అలాగే స్వతహాగా మంచి డాన్సర్ అయిన డింపుల్ మహేష్ తో కలిసి ఎలా స్టెప్పులు వేస్తుందో అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఉవ్విళ్లూరుతున్నారు. అసలు ముందుగా ఆ సాంగ్ లో పూజ హెగ్డే చేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో డింపుల్ అవకాశాన్ని పొందింది. మహేష్ లాంటి సూపర్ స్టార్ పక్కన డాన్స్ చేసే అవకాశాన్ని పొందటం నిజంగా డింపుల్ అదృష్టమే అని చెప్పవచ్చు. పైగా ఈ అవకాశం ఆమె సినీ కెరీర్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. డింపుల్ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రంలో జర్ర జర్ర అనే ఐటెం సాంగ్ లో సూపర్ గా డాన్స్ వేసి అందర్నీ మెప్పించింది.
సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవ్వడానికి వడివడిగా ముస్తాబవుతున్న గుంటూరు కారంకి త్రివిక్రమ్ దర్శకుడు కాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
![]() |
![]() |