![]() |
![]() |

ఇళయ దళపతి విజయ్ మొన్న దసరాకి లియో తో వచ్చి మంచి విజయాన్నే అందుకున్నాడు. తన అందమైన కుటుంబం తనకి దూరం కాకూడదని ఒక నిజాన్ని మరింత నిజంగా మార్చే క్యారక్టర్ లో విజయ్ ప్రదర్శించిన నటన ఒక రేంజ్ లో ఉంటుంది. తాజాగా ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ రెగ్యులర్ జరుగుతుంది. కాగా గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఇదే అంటూ ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది.
విజయ్ నటిస్తున్న కొత్త చిత్రానికి బాస్ అనే టైటిల్ ని నిర్ణయించారనే వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. కానీ తమ సినిమాకి బాస్ అనే టైటిల్ ని ఖరారు చేశామనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అర్చన తెలిపారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఒక డిఫరెంట్ టైటిల్ ని ఈ చిత్రానికి అనుకుంటున్నారని టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని అధికారకంగా వెల్లడి చేస్తామని కూడా ఆమె చెప్పింది.

విజయ్ కెరీర్ లో 68 చిత్రంగా తెరెకెక్కుతున్న ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వెళ్తాడనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. కానీ విజయ్ అట్లీ ,కార్తీక్ సుబ్బరాజ్ దర్సకత్వంలో కూడా ఇంకో రెండు కొత్త సినిమాలు చేస్తున్నదని కూడా అంటున్నారు.మరి ఈ వార్త కూడా విజయ్ కొత్త సినిమా టైటిల్ లాగ పుకారా లేక విజయ్ నిజంగానే ఆ ఇద్దరి సినిమాలు చేస్తున్నాడా అనేది కొన్ని రోజులు అయితే కానీ తెలియదు.
![]() |
![]() |