![]() |
![]() |

తాప్సీ పన్ను.. లేటెస్ట్ గా వచ్చిన డంకీ సినిమాతో ఇప్పుడు తాప్సీ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోతుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఆమె ఆ తర్వాత పలు భాషల చిత్రాలు చేసి మంచి నటి అనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చి బేబీ, పింక్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అక్కడ లక్కీ హీరోయిన్ గా ముద్రపడింది. తాజాగా ఆమె తన ఫస్ట్ లవ్ గురించి చెప్పి సంచలనం సృష్టిస్తుంది.
తాప్సీ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నేను తొమ్మిదవ క్లాస్ లోనే 10 వ క్లాస్ చదివే ఒక అబ్బాయిని ప్రేమించాను .ఆ విషయం అతనికి కూడా చెప్పాను. అతను కూడా నా మీద ఇంట్రెస్ట్ చూపించాడు.కానీ ఆ తర్వాత తన చదువు పాడు అవుతుందని అనుకోని నా ప్రేమకి దూరమయ్యాడు. పైగా నన్ను కూడా బాగా చదువుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చాడు.
ఇప్పుడు తాప్సీ చెప్పిన ఈ విషయాన్నీ చూసిన చాలా మంది తాప్సి ఇన్నాళ్లకు తన లవ్ గురించి బయపెట్టిందని అంటున్నారు. ప్రస్తుతం డంకీ సినిమాలో ఆమె పోషించిన మను పాత్రకి మంచి పేరు వస్తుంది.
![]() |
![]() |