![]() |
![]() |
వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు సూర్య. తను చేసే పాత్ర కోసం ఎలాంటి సాహసం చేయడానికై సిద్ధపడే సూర్య ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త తరహా సినిమాలతో తనకంటూ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు సుధా కొంగర. గతంలో సూర్యతో ‘ఆకాశం నీ హద్దురా’ చేసిన సుధ ఇప్పుడు సూర్య హీరోగా మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సూర్య 43వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా కథాంశం ఏమిటి అనేది ఇప్పటివరకు రివీల్ చెయ్యలేదు. 1967లో తమిళనాడులో చెలరేగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడు సూర్య. ఇంతకుముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘యువ’ చిత్రంలో స్టూడెంట్ లీడర్ మైఖేల్ పాత్రను ఎంతో గొప్పగా పోషించిన సూర్యకు మరోసారి అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. అయితే అది ఫిక్షనల్ స్టోరీ. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో చేయబోయే సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనుంది.
గతంలో బాక్సింగ్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సుధా కొంగర రూపొందించిన సినిమాకు చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సూర్యతో చేయబోయే సినిమా కూడా వాస్తవ ఘటనల ఆధారంగా చేస్తున్నది కావడంతో తప్పకుండా ఇది మరో మెమరబుల్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా కథ ఎంతో సున్నితమైన అంశంతో కూడుకున్నది కావడం వల్ల దీనికి కొన్ని సవాళ్ళు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. వాటన్నింటినీ తట్టుకొని సినిమా చేయడం అంటే సూర్యకు, సుధకు సాహసంతో కూడుకున్నదనే చెప్పాలి. మరి ఈ సినిమాపై తమిళనాడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.
![]() |
![]() |