![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇంటర్నేషనల్ మీడియాలో మారుమోగిపోతోంది. రోజుకో ఘనతతో ఎన్టీఆర్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ 'వెరైటీ' ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 500 మంది వ్యక్తుల జాబితాలో ఎన్టీఆర్ చోటు దక్కించుకున్నాడు. సౌత్ ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన మొదటి హీరో తారక్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే అభిమానులు ఆ ఆనందంలో ఉండగానే ఇప్పుడు ఎన్టీఆర్ మరో ఘనతను సాధించాడు.
ప్రముఖ మ్యాగజైన్ 'ఏషియన్ వీక్లీ' తాజాగా ఆసియాలో టాప్-50 నటుల జాబితాను విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్ 25వ స్థానంలో నిలిచాడు. అంతేకాదు టాలీవుడ్ నుంచి ఈ లిస్టులో స్థానం సంపాదించుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్నేషనల్ మీడియాలో తారక్ పేరు మారుమోగుతుండటంతో.. ఆయన అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో పాటు, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి.
![]() |
![]() |