![]() |
![]() |

రంగమ్మత్త గురుంచి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ఆడియన్స్ కు బాగా తెలిసిన పేరు అనసూయ. ఇటు స్మాల్ స్క్రీన్ పై అటు సిల్వర్ స్క్రీన్ పై దుమ్ము రేపుతూ ఉంటుంది. డేరింగ్ అండ్ డాషింగ్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఎన్నో షోస్ కి హోస్ట్ గా చేస్తూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అనసూయ తన మూవీ అప్ డేట్స్ తో పాటు తన పర్సనల్ అప్ డేట్స్ ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది.
ఐతే ఈరోజు అనసూయ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భర్త భరద్వాజ్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఆ క్యూట్ మూమెంట్స్ ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈరోజు తనకెంతో స్పెషల్ అని ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. 'హ్యాపీ యానివర్సరీ మై లవ్ సుశాంక్ భరద్వాజ్' అంటూ కాప్షన్ కూడా పెట్టి భర్తకు విషెస్ కూడా చెప్పింది. ఇక రాబోయే మూవీస్ ఐన 'పుష్ప 2', 'రంగ మార్తాండ' లో నటిస్తోంది. నెటిజన్లు కూడా 'హ్యాపీ యానివర్సరీ క్యూట్ కపుల్' అంటూ మెసేజెస్ చేస్తున్నారు.
![]() |
![]() |