Home

»

Latest News

`జ్యోతి`గా జ‌య‌సుధ జేజేలు అందుకుని నేటికి 46 ఏళ్ళు!

Jun 4, 2022 1:04PM

`స‌హ‌జ‌న‌టి` జ‌య‌సుధ‌కి కెరీర్ ఆరంభంలో న‌టిగా ఎన‌లేని గుర్తింపుని తీసుకువ‌చ్చిన చిత్రాల్లో `జ్యోతి` ఒక‌టి. జ‌య‌భాదురి టైటిల్ రోల్ లో న‌టించిన బాలీవుడ్ మూవీ `మిలి` (1975) స్ఫూర్తితో ఈ సినిమాని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్రరావు. ఓ ప్రాణాంతక వ్యాధితో బాధ‌ప‌డుతున్న జ్యోతి (జ‌య‌సుధ‌) అనే యువ‌తి..  ప్రేమించిన ర‌వి (ముర‌ళీ మోహ‌న్) ని కాకుండా, త‌న తండ్రి వ‌య‌సు ఉన్న రాజ‌య్య(గుమ్మ‌డి)ని పెళ్ళిచేసుకుంటుంది.  ఆ త‌రువాత జ్యోతికి  ఎదుర‌య్యే ప‌రిస్థితుల నేప‌థ్యంలో  ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ నడుస్తుంది. ఇందులో జ్యోతిగా త‌న అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న జ‌య‌సుధ‌.. `ఉత్త‌మ న‌టి`గా ఇటు తొలి `నంది` పుర‌స్కారాన్ని, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డుని కైవ‌సం చేసుకున్నారు.

 కృష్ణ‌కుమారి, రావు గోపాల రావు,  కైకాల స‌త్య‌నారాయ‌ణ‌,  గిరిబాబు, ఛాయాదేవి, జేవీ సోమ‌యాజులు, శుభ‌, `ఫ‌టాప‌ట్` జ‌య‌ల‌క్ష్మి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన `జ్యోతి`కి చ‌క్ర‌వ‌ర్తి సంగీత‌మందించ‌గా, ఆత్రేయ సాహిత్య‌మందించారు. ఇందులోని ``సిరిమ‌ల్లె పువ్వ‌ల్లే న‌వ్వు``, ``నీకూ నాకూ పెళ్ళంట‌`` అంటూ సాగే పాట‌లు విశేషాద‌ర‌ణ పొందాయి. క్రాంతి కుమార్ నిర్మించిన `జ్యోతి`.. 1976 జూన్ 4న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. నేటితో ఈ సినిమా 46 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com