Home

»

Latest News

అంచనాల‌ను మించి ఓపెనింగ్స్ రాబ‌ట్టిన 'మేజ‌ర్‌'

Jun 4, 2022 12:27PM

 

అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన 'మేజ‌ర్' మూవీ తెలుగునాట తొలిరోజు అంచ‌నాల‌కు మించి ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టింది. 2008 న‌వంబ‌ర్ 26న ముంబై తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్‌లో జ‌రిగిన టెర్ర‌రిస్ట్ ఎటాక్‌లో అనేక‌మంది పౌరుల‌ను ర‌క్షించి, ప్రాణాల‌ను తృణ‌ప్రాయంగా అర్పించిన వీర సైనికుడు మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ బ‌యోపిక్‌గా శ‌శికిర‌ణ్ తిక్కా డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్ర‌వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.07 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి.

తెలంగాణ‌లో రూ. 1.75 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.86 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 46 ల‌క్ష‌ల షేర్‌ను 'మేజ‌ర్' మూవీ సాధించింది. తెలుగునాట ఈ మూవీ ప్రి బిజినెస్ విలువ రూ. 13 కోట్లు. అంటే 31.3 శాతం తొలిరోజే రిక‌వ‌రీ అయ్యింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూసుకుంటే.. ఈ సినిమా సాధించిన షేర్ రూ. 7.12 కోట్లు. ప్రి బిజినెస్ వాల్యూ రూ. 18 కోట్ల‌ని అంచ‌నా. ఆ ప్ర‌కారం చూసుకుంటే.. 39.5 శాతం రిక‌వ‌రీ అయ్యింది. 'మేజ‌ర్' లాంటి సినిమా ఫ‌స్ట్ డేనే ఈ రేంజ్‌లో క‌లెక్ష‌న్ సాధించ‌డం బిజినెస్ వ‌ర్గాల‌ను ఆనందాశ్చ‌ర్యాల‌కు గురిచేసింది. హిందీ వెర్ష‌న్ తొలిరోజు రూ. 35 ల‌క్ష‌ల షేర్ సాధించింది.

అడివి శేష్ స్వ‌యంగా క‌థ‌, స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చిన ఈ మూవీలో సాయీ మంజ్రేక‌ర్‌, ప్ర‌కాశ్ రాజ్‌, రేవ‌తి, ముర‌ళీశ‌ర్మ‌, శోభిత ధూళిపాళ కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం, వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్ర‌ఫీ 'మేజ‌ర్‌'కు టెక్నిక‌ల్‌గా మెయిన్ ఎస్సెట్ అయ్యాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com