![]() |
![]() |

పూర్ణ పేరు చెప్తే చాలు "అవును" మూవీ గుర్తొస్తుంది. తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు ఈమెది. ఎందుకంటే మూవీస్ తో పాటు ఎన్నో షోస్ లో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరపై నిత్యం కనిపిస్తూనే ఉంటారు. ఈమె అల్లరి నరేష్ తో కలిసి సీమ టపాకాయ్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల బాలకృష్ణ తో కలిసి అఖండ మూవీలో కూడా మెరిసింది.

జయమ్ము నిశ్చయమ్మురా అనే మూవీలో కూడా ఈమె యాక్ట్ చేసింది. ఆ మూవీ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత పెద్ద ఆఫర్స్ ఏమీ పూర్ణకి రాలేదు. ఈమె ఇప్పటివరకు మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగులో కలిపి సుమారు 40 కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏమిటి అంటే ఈమె పెళ్లిపీటలెక్కబోతోంది. ఫేమస్ జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ ఐన షనీద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీనికి సంబందించిన ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది పూర్ణ. ఈ న్యూస్ వినగానే సినీ ప్రముఖులు, నెటిజెస్ విషెస్ చెప్తున్నారు.
![]() |
![]() |