![]() |
![]() |

రిచా అంటే చాలు 'నువ్వే కావాలి' మూవీ గుర్తొస్తుంది. 2000 లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈమె దాదాపు 200 లకి పైగా యాడ్ ఫిలిమ్స్ లో కూడా నటించారు. హిందీ మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది రిచా పల్లాడ్. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ 'నువ్వే కావాలి'కి ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. రిచా బెంగుళూరులో ఆగష్టు 30 1980 లో పుట్టారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈమె ఎన్నో మూవీస్ చేశారు.
ఒక వైపు మూవీస్ లో యాక్ట్ చేస్తూ 2011 లో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 2013 లో ఈమెకు ఒక కొడుకు పుట్టాడు. తర్వాత కొంత కాలం ఆగి 2016 లో 'మలుపు' అనే మూవీలో యాక్ట్ చేసారు. అనుకున్నంత గుర్తింపు రాకపోయేసరికి ఆమె ఫీల్డ్ నుంచి తప్పుకున్నారు. ఒక లాంగ్ గ్యాప్ తర్వాత 2020 లో "యువర్ ఆనర్" అనే వెబ్ సిరీస్ లో ప్రత్యేక పాత్రలో మెరిశారు. 'నువ్వే కావాలి' తర్వాత చిరుజల్లు, నా మనసిస్తారా, హోలీ వంటి మూవీస్ లో యాక్ట్ చేసింది. కానీ అన్ని ఫ్లాప్స్ అయ్యేసరికి డైరెక్టర్స్ కూడా ఈమెను పక్కన పెట్టేసారు.
రిచా పెళ్లి విషయం ఎప్పుడూ ఒక మిస్టరీని అని చెప్పుకుంటారు అభిమానులు. ఎందుకు అంటే ఎక్కడా కూడా భర్తతో కలిసున్న ఫొటోస్ అనేవి కనిపించవు. సింగల్ గా ఉన్న రిచా ఫొటోస్ మాత్రమే ఉంటాయి. అభిమానులు కూడా రిచా ఫామిలీ లైఫ్ డీటెయిల్స్ కోసం ఎంతో సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువగా తన విషయాలను షేర్ చేసుకుంటుంది రిచా. 'కుచ్ తుమ్ కహా కుచ్ హమ్ కహే' మూవీలో రిచా.. ఫర్దీన్ ఖాన్ తో కలిసి నటించింది. ఆ మూవీ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ వాటికి వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత ఎవరికి నచ్చిన వాళ్ళను వివాహం చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు.
ఇప్పుడు రిచా తన భర్తకు హెల్పింగ్ గా ఉంటూ కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. రిచా వయసు 41 ..ఆలివ్ స్కిన్ ఉన్న వాళ్ళ చర్మం త్వరగా ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రిచా స్కిన్ కూడా అలా ఉండడం వలన తన ఆకారం మొత్తం మారిపోయి ముసలితనపు ఛాయలతో కనిపించేసరికి అభిమానులు కంగారుపడ్డారు. తమ హీరోయిన్ ఎందుకిలా ఐపోయింది అని.
ఏదైమైనా రిచా మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది భర్తో, బిడ్డతో కలిసి. ఇక ఫైనల్ గా మూవీస్ లో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినా తన రూటు మార్చి డబ్బింగ్ చెప్తూ మంచి పేరు తెచ్చుకుంది. హిందీలో రిలీజ్ అయ్యే మూవీస్ కి చాలా వరకు రిచా డబ్బింగ్ చెప్తూ తనకు ఇష్టమైన రంగంలో రాణిస్తోంది. ఎవరేమి అనుకున్నా ఒక యాక్టర్ గా తన ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ కాకపోయి ఉండొచ్చు కానీ తన పర్సనల్ లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యిందని దీన్ని బట్టి అర్థమౌతోంది.
![]() |
![]() |