![]() |
![]() |

మల్టిటాలెంటెడ్ ప్రభుదేవా.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. మరీముఖ్యంగా.. 2006లో విడుదలైన అన్య దర్శకుల తెలుగు చిత్రాలు `పోకిరి`, `విక్రమార్కుడు`ని.. బాలీవుడ్ లో తనదైన శైలిలో తెరకెక్కించి ఘనవిజయాలు చూశారు ప్రభుదేవా. `పోకిరి` బాలీవుడ్ వెర్షన్ `వాంటెడ్`(2009)తో హిందీనాట దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మెప్పించిన ప్రభుదేవా.. ఆపై `విక్రమార్కుడు` రీమేక్ `రౌడీ రాథోర్` (2012)తోనూ సక్సెస్ అందుకున్నారు. అలాంటి `రౌడీ రాథోర్` విడుదలై నేటికి సరిగ్గా పదేళ్ళు.
విక్రమ్ సింగ్ రాథోర్, శివ భరద్వాజ్ గా అక్షయ్ కుమార్ ద్విపాత్రాభినయం చేసిన `రౌడీ రాథోర్`లో సోనాక్షి సిన్హా కథానాయికగా నటించగా.. నాజర్, సుప్రీత్ రెడ్డి, యశ్ పాల్ శర్మ, పరేష్ గణత్ర, అమిత్ తివారి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. కోలీవుడ్ స్టార్ విజయ్, కరీనా కపూర్, ప్రభుదేవా, ముమైత్ ఖాన్, మరియం జకారియా పాటల్లో తళుక్కున మెరిశారు. సాజిద్ - వాజిద్ సంగీతమందించిన ఈ చిత్రంలో పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, రోనీ స్క్రూవాలా సంయుక్తంగా నిర్మించిన `రౌడీ రాథోర్`.. 2012 జూన్ 1న విడుదలై వసూళ్ళ వర్షం కురిపించింది.
![]() |
![]() |