Home  »  News  »  మీతో ప‌ని చేసేప్పుడు ప్ర‌తి న‌టి చాలా సౌక‌ర్యంగా ఫీల‌వుతుంది!

Updated : Jun 1, 2022

 

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, అందార తార రాధ జంట‌గా ప‌లు సినిమాల్లో న‌టించారు. వాటిలో హిట్లు, సూప‌ర్‌హిట్లు, బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఉన్నాయి. కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట్ చేసిన 'శ‌క్తి' (1983) సినిమాతో కృష్ణ‌-రాధ జోడీ మొద‌లైంది. ఆ సినిమా ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల ఆద‌ర‌ణ పొందింది. ఆ త‌ర్వాత వారి క‌ల‌యిక‌లో ఇద్ద‌రు దొంగ‌లు, దొంగ‌లు బాబోయ్ దొంగ‌లు, ప‌ల్నాటి సింహం, అగ్నిప‌ర్వ‌తం, సింహాస‌నం, ముద్దాయి, దొంగోడొచ్చాడు, తండ్రీకొడుకుల ఛాలెంజ్‌, కృష్ణ ప‌ర‌మాత్మ‌, చుట్టాల‌బ్బాయి, పార్థుడు, ముగ్గురు కొడుకులు, రౌడీ నెంబ‌ర్ 1, జ‌మ‌ద‌గ్ని, సార్వ‌భౌముడు, అజాత శ‌త్రువు, ఆయుధం, ప‌ర‌మ‌శివుడు లాంటి సినిమాలు వ‌చ్చాయి.

మంగ‌ళ‌వారం మే 31 కృష్ణ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అభిమానులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. వేలాదిమంది సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాధ సైతం త‌న హీరోకు ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. 

కృష్ణ‌తో ఓ సాంగ్‌లో న‌టించిన పిక్చ‌ర్‌ను షేర్ చేసిన ఆమె, "Dear Krishna sir, Many many happy returns of the day! Every second I worked along with you will forever be in my memory. Not only me but every actress feel so much comfortable working with you , a true & picture perfect gentleman. (డియ‌ర్ కృష్ణ సార్‌, మెనీ మెనీ హ్యాపీ రిట‌ర్న్స్ ఆఫ్ ది డే! మీతో ప‌ని చేసిన ప్ర‌తి సెక‌ను నా మెమ‌రీలో ఎప్ప‌టికీ ఉండిపోతుంది. నేనే కాదు, ప్ర‌తి న‌టి మీతో ప‌ని చేసేప్పుడు చాలా సౌక‌ర్యంగా ఫీల‌వుతుంది. నిజ‌మైన‌, పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ జెంటిల్‌మేన్)" అంటూ ఆయ‌న‌ను గొప్ప‌గా పొగిడారు. ఈ పోస్ట్‌ను మ‌హేశ్‌బాబుకు ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ బాగా వైర‌ల్ అయ్యింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.