![]() |
![]() |

పవన్ కల్యాణ్ కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మూవీ 'ఖుషి'. అదే పేరుతో తమిళంలో వచ్చి హిట్టయిన సినిమాకు రీమేక్‌గా రూపొందిన ఆ సినిమాలో పవన్, భూమిక మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకొని, వసూళ్ల వర్షం కురియడానికి తోడ్పడింది. ఎస్.జె. సూర్య డైరెక్షన్లో 2001లో వచ్చిన ఆ సినిమాలో సిద్ధార్థ్ రాయ్‌గా పవన్ పర్ఫార్మెన్స్ను ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ గుర్తు చేసుకొని, ఆనందపడుతుంటారు.
ఇప్పుడు అదే టైటిల్‌తో తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'ఖుషి' అనే టైటిల్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ టైటిల్‌ను ప్రకటించారో, అప్పట్నుంచీ పవన్ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండపై గుర్రుగా ఉన్నారు. పాత టైటిల్స్‌ను వాడుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఇదివరకే పవన్ మరో హిట్ సినిమా 'తొలిప్రేమ' టైటిల్‌ను వరుణ్ తేజ్ సినిమాకు వాడుకున్నాడు.
ఇప్పుడు 'ఖుషి' టైటిల్‌ను వాడుకుంటుండటంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణను ట్యాగ్ చేస్తూ టైటిల్‌ను మార్చమని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే, 'ఖుషి' టైటిల్‌ను పాడు చేయొద్దనీ, ఏదైనా తేడా జరిగితే బాగోదనీ హెచ్చరిస్తున్నారు కూడా. 'ఖుషి' చాలా అందమైన ప్రేమకథ అనీ, అలాంటి ప్రేమకథనే తీయమనీ డైరెక్టర్ శివ నిర్వాణకు సూచిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
![]() |
![]() |