![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని నిర్మించిన `హిట్ః ద ఫస్ట్ కేస్`(2020)తో దర్శకుడిగా తొలి అడుగేశాడు శైలేశ్ కొలను. విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన సదరు యాక్షన్ థ్రిల్లర్.. శైలేశ్ కొలనుకి నిర్దేశకుడిగా శుభారంభాన్నిచ్చింది. కట్ చేస్తే.. త్వరలో ఈ టాలెంటెడ్ కెప్టెన్ రెండు సినిమాలతో పలకరించబోతున్నాడు. అది కూడా.. కేవలం రెండు వారాల వ్యవధిలో ఈ చిత్రద్వయాలు తెరపైకి రాబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. `హిట్ః ద ఫస్ట్ కేస్`కి రీమేక్ గా హిందీలో ఓ సినిమాని రూపొందించాడు శైలేశ్. సేమ్ టైటిల్ తోనే తయారైన ఈ బాలీవుడ్ మూవీలో రాజ్ కుమార్ రావ్, సన్యా మల్హోత్రా జంటగా నటించారు. `దిల్` రాజు ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ రీమేక్.. ఈ ఏడాది జూలై 15న తెరపైకి రాబోతోంది. మరోవైపు.. `హిట్`కి సీక్వెల్ గా `హిట్ః ద సెకండ్ కేస్` పేరుతో శైలేశ్ కొలను దర్శకత్వంలోనే మరో సినిమా రూపొందింది. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సీక్వెల్ మూవీ.. ఇదే సంవత్సరం జూలై 29న రిలీజ్ కానుంది. మరి.. ఒకే నెలలో అటు `హిట్` రీమేక్ తోనూ, ఇటు `హిట్` సీక్వెల్ తోనూ డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శైలేశ్.. ఆయా ప్రయత్నాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |