![]() |
![]() |

కోలీవుడ్ లో డైరెక్టర్ గా, యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని కొంతకాలంగా తెలుగులోనూ వరుస సినిమాలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే త్వరలో ఆయన ఓ భారీ మూవీ డైరెక్ట్ చేయబోతున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తుండటం విశేషం.
డైరెక్టర్ గా ఎన్నో విజయాలను అందుకున్న సముద్రఖని గతేడాది 'వినోదయ సీతం'తో మెప్పించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తెలుగు రీమేక్ కూడా సముద్రఖనే డైరెక్ట్ చేస్తారని.. తమిళ్ లో సముద్రఖని, తంబి రామయ్య పోషించిన పాత్రలలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా సముద్రఖని తాను పవన్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు చెప్పి సర్ ప్రైజ్ చేశారు.
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 'వినోదయ సీతం' తెలుగు రీమేక్ డైరెక్ట్ చేయబోతున్నట్లు సముద్రఖని క్లారిటీ ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానినని, తనలాంటి అభిమానులందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయనను డైరెక్ట్ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సముద్రఖని అన్నారు. త్రివిక్రమ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
![]() |
![]() |