![]() |
![]() |

మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటి రోజు కలెక్షన్ల దుమ్ము దులిపింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 36 కోట్లకు పైగా షేర్, వరల్డ్‌వైడ్‌గా రూ. 45 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. నైజాంతో పాటు మరికొన్ని చోట్ల నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేసింది. డివైడ్ టాక్ తో ఈ రేంజ్ ఓపెనింగ్స్ సాధించడం మహేష్ కే సాధ్యమంటూ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం #SVPFakeCollections అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

కోలీవుడ్ లో విజయ్, అజిత్ ల ఫ్యాన్స్.. ఒక హీరోకి వ్యతిరేకంగా మరో హీరో ఫ్యాన్స్ ట్విటర్ లో ట్రెండ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇది టాలీవుడ్ కి కూడా పాకింది. ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరోకి వ్యతిరేకంగా ట్రెండ్ చేస్తున్నారు. ఇటీవల మెగా మూవీ 'ఆచార్య'పై ట్విట్టర్ లో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు 'సర్కారు వారి పాట' వంతు వచ్చింది. #SVPFakeCollections, #sVPDisaster అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్విట్టర్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో వచ్చిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు అని రాసుకుంటున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ ట్రోల్స్ ని మహేష్ ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. మహేష్ క్రేజ్ అలాంటిది అని, టాలీవుడ్ లో ఏ హీరోకి సాధ్యం కాని విధంగా యూఎస్ లో 11 సినిమాలు 1 మిలియన్ మార్క్ ని అందుకోవడాన్ని బట్టే మహేష్ రేంజ్ ఏంటో చెప్పొచ్చని అంటున్నారు.
![]() |
![]() |