![]() |
![]() |

`పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగునాట యూత్ ఐకాన్ గా గుర్తింపు పొందాడు విజయ్ దేవరకొండ. త్వరలో ఈ రౌడీ హీరో.. `లైగర్`గా పలకరించబోతున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. ఆగస్టు 25న తెరపైకి రాబోతోంది. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా, పూరి దర్శకత్వంలోనే `జన గణ మన`ని రీసెంట్ గా పట్టాలెక్కించాడు విజయ్.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. శివ నిర్వాణ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న పేరు నిర్ణయించని చిత్రం.. సంక్రాంతిని టార్గెట్ చేసుకుని నిర్మాణం జరుపుకుంటోందట. అదే గనుక నిజమైతే.. సంక్రాంతి బరిలో సందడి చేసే విజయ్ దేవరకొండ మొదటి సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. కాగా, 2023 ముగ్గుల పండక్కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `ఆది పురుష్`, విజయ్ నటిస్తున్న `దళపతి 66` (వర్కింగ్ టైటిల్) రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` కూడా ఇదే సీజన్ లో ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉందంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి.. వేటిలో ఏయే చిత్రాలు పతంగుల పండగకి పలకరిస్తాయో!
![]() |
![]() |