![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్యకి అతిథి వేషాలు కొత్తేమీ కాదు. `జూన్ ఆర్` (2006), `కుసేలన్` (2008), `మన్మథన్ అంబు` (2010), `కో` (2011), `అవన్ ఇవన్` (2011), `చెన్నైయిల్ ఒరు నాళ్` (2013), `నినైదదు యారో` (2014), `పసంగ 2` (2015), `కడైకుట్టి సింగం` (2018) వంటి తమిళ చిత్రాల్లో గెస్ట్ గా సందడి చేశారాయన. వీటిలో కొన్ని సినిమాలు తెలుగులోనూ అనువాద రూపంలో అలరించాయి. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం సూర్య మళ్ళీ స్పెషల్ రోల్స్ లో ఎంటర్టైన్ చేయనున్నారు. అది కూడా.. వరుస నెలల్లో రాబోతున్న రెండు ఆసక్తికరమైన చిత్రాలతో.
ఆ వివరాల్లోకి వెళితే.. లోక నాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో `విక్రమ్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. జూన్ 3న రిలీజ్ కానుంది. కాగా, ఇందులో పతాక సన్నివేశాల్లో తళుక్కున మెరవనున్నారట సూర్య. అంతేకాదు.. జూలై 1న పలు భాషల్లో విడుదల కానున్న బయోగ్రాఫికల్ డ్రామా `రాకెట్రీః ద నంబి ఎఫెక్ట్`లోనూ సూర్య కాసేపు దర్శనమివ్వనున్నారు. మాధవన్ టైటిల్ రోల్ లో నటించడమే కాకుండా.. స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంపై జనాల్లో మంచి ఆసక్తి ఉందనే చెప్పాలి. మరి.. జూన్, జూలై నెలల్లో రాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ తో సూర్య అతిథిగా ఏ స్థాయిలో రంజింపజేస్తారో చూడాలి.
![]() |
![]() |