![]() |
![]() |

నటభూషణ శోభన్ బాబుకి అచ్చొచ్చిన దర్శకుల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ ఒకరు. వీరిద్దరి కలయికలో పలు ప్రజారంజక చిత్రాలు వచ్చాయి. వాటిలో `జీవిత నౌక` ఒకటి. సింహభాగం గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శోభన్ బాబు సరసన జయప్రద, జయసుధ నటించారు. శరత్ బాబు, రాజబాబు, ముక్కామల, త్యాగరాజు, రమోలా, ప్రభావతి, సాక్షి రంగారావు, మాస్టర్ రాము ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చిన ఈ చిత్రానికి కె. విశ్వనాథ్ నే కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి దిగ్గజ గీత రచయిత సి. నారాయణరెడ్డి సాహిత్యమందించారు. ``చల్లనమ్మే భామనోయ్``, ``గోపాలా నందనందనుడెందో లేదో``, ``చిలకపచ్చని చీరలోన``, ``తుమ్మెదా``, ``వేయి దీపాలు నాలోన వెలిగితే``, ``గిలిగింతలు పలుకగలిగితే``.. ఇలా ఇందులోని పాటలన్నీ రంజింపజేశాయి. డీవీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై డీవీయస్ రాజు నిర్మించిన `జీవిత నౌక`.. 1977 మే 13న విడుదలై మ్యూజికల్ గా మెప్పించింది. నేటితో ఈ చిత్రం 45 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |