![]() |
![]() |

మాన్‌స్టర్ హిట్ మూవీ 'కేజీఎఫ్ చాప్టర్ 2'లో నటించిన సీనియర్ నటుడు మోహన్ జునేజా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో కొంత కాలంగా అదే హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతూ వచ్చారు. ఆయన అంత్యక్రియలు ఈరోజే జరిగాయి.
మోహన్ జునేజా పలు కన్నడ చిత్రాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించారు. ఆయన 100కు పైగా సినిమాల్లో నటించారు. శంకర్ నాగ్ మూవీ 'వాల్ పోస్టర్' ద్వారా ఆయన నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళం సినిమాల్లోనూ ఆయన నటించారు.
'కేజీఎఫ్' రెండు భాగాల్లో నాగరాజు అనే ఇన్‌ఫార్మర్ క్యారెక్టర్‌ను పోషించారు మోహన్ జునేజా.
![]() |
![]() |