![]() |
![]() |

మెగా కాంపౌండ్ హీరో సాయి తేజ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `సుప్రీమ్` ఒకటి. `పటాస్` (2015) వంటి బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా తొలి అడుగేసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి వచ్చిన రెండో చిత్రమిది. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించిన ఈ చిత్రంలో సాయితేజ్ కి జంటగా రాశీ ఖన్నా నటించగా.. మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్రప్రసాద్, కబీర్ దుహన్ సింగ్, సాయికుమార్, రవికిషన్, మురళీ మోహన్, సిజ్జు, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, సురేఖా వాణి, పృథ్వీరాజ్, సత్యం రాజేశ్, సుడిగాలి సుధీర్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. `పటాస్` ఫేమ్ శ్రుతి సోథి స్పెషల్ సాంగ్ లో తన చిందులతో కనువిందు చేసింది.
సాయి కార్తిక్ సంగీతమందించిన ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు. ``అందం హిందోళం`` ( రీమిక్స్), ``బెల్లం శ్రీదేవి``, ``టాక్సీ వాలా``, ``ఆంజనేయుడు నీవాడు``, ``ఛలో ఛలో`` - ఇలా ఇందులోని గీతాలన్ని ఆకట్టుకున్నాయి. 2016 మే 5న విడుదలై విజయం సాధించిన `సుప్రీమ్`.. నేటితో ఆరు వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |