Home

»

Latest News

వైజాగ్ లో చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ

May 4, 2022 5:39PM

మార్చి 25 న విడుదలైన 'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏప్రిల్ 29 న విడుదలైన 'ఆచార్య'తో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇలా రెండు వరుస నెలల్లో ఓ భారీ విజయం, ఓ భారీ పరాజయం చూసిన చరణ్.. జయాపజయాలను పట్టించుకోకుండా ఫ్యాన్స్ ని అలరించడానికి తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో 15 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతుంది. దీంతో నేడు చరణ్ వైజాగ్ వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఫ్యాన్స్ నుంచి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి రాడిసన్ హోటల్ వరకు వందల మంది బైక్ లపై జెండాలు పట్టుకొని చరణ్ కారుని ఫాలో అవుతూ ర్యాలీ నిర్వహించారు. కొందరు అభిమానులు అయితే రాడిసన్ గోడలు ఎక్కి లోపలికెళ్ళి చరణ్ ని కలిసే ప్రయత్నం చేశారు. దీంతో వారిని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది బాగా ఇబ్బంది పడ్డారు.

RC15 లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com