![]() |
![]() |

విష్వక్ సేన్ సాధించాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'అశోకవనంలో అర్జున కల్యాణం' గురించి నలుగురూ మాట్లాడుకొనేలా, ఆ సినిమా కోసం ఎదురుచూసేలా చేయడంలో అతను విజయం సాధించాడు. ఇటీవల ఓ టీవీ చానల్‌తో ఏర్పడిన వివాదం అతనికీ, అతని సినిమాకూ అనూహ్యమైన ఉచిత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. ఆ సినిమా ట్రైలర్ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాని తోటి హీరోలు ప్రశంసించడం మొదలుపెట్టారు.
'అశోకవనంలో అర్జున కల్యాణం' శుక్రవారం మే 6న విడుదలవుతోంది. దానికి రెండు రోజుల ముందు సినీ సెలబ్రిటీలకు ఈ సినిమాని ప్రదర్శించాడు విష్వక్. సినిమాని చూసిన సెలబ్రిటీల సోషల్ మీడియా ద్వారా సినిమానీ, విష్వక్ సేన్‌నూ ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. వారిలో యువ హీరోలు సాయిధరమ్ తేజ, సిద్ధు జొన్నలగడ్డ ఉన్నారు. చక్కని రొమాన్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని వారు ప్రశంసించారు.


రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో సూర్యాపేటకు చెందిన అర్జున్ అనే యువకునిగా విష్వక్ సేన్, ఆంధ్రా అమ్మాయి పసుపులేటి మాధవిగా రుక్సర్ ధిల్లాన్ నటించారు. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించాడు.
![]() |
![]() |