![]() |
![]() |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'లైగర్'. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగష్టు 25 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
మే 9వ తేదీ, సాయంత్రం 4 గంటల నుంచి లైగర్ వేట మొదలుపెట్టబోతున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ సమయానికి లైగర్ టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ టీజర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

'లైగర్' విడుదల కాకముందే విజయ్-పూరి కాంబోలో మరో సినిమా కూడా ప్రారంభమైంది. అదే 'జనగణమన'. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టులో విడుదల కానుంది.
![]() |
![]() |