![]() |
![]() |

దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్- 2022 లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ విభాగాల్లో అవార్డులు లభించాయి.
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'నాంది'. ఈ మూవీతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమయ్యాడు. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా జరిగిన 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ చిత్రం.. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా విజయ్ కనకమేడలకు అవార్డు తెచ్చిపెట్టింది.

అలాగే దర్శకుడు రాజ్ మాదిరాజు బెస్ట్ డైరెక్టర్ గా రెండోసారి దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు అందుకోవడం విశేషం. 2012 లో జరిగిన సెకండ్ ఎడిషన్ లో 'ఋషి' చిత్రానికి గాను ఆయన బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నాడు. పదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు 12వ ఎడిషన్ లో 'గ్రే' సినిమాకి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు సాధించాడు. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, అరవింద్ కృష్ణ, ఊర్వశి రాయ్ కీలక పాత్రల్లో నటించిన 'గ్రే' సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. 40 ఏళ్ల తర్వాత తెలుగులో వస్తున్న బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇదే కావడం విశేషం.

![]() |
![]() |