![]() |
![]() |

కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామాల్లో చాలా వరకు విజయపథంలో పయనించాయి. వాటిలో `ఆహ్వానం` ఒకటి. 1959 నాటి `పెళ్ళినాటి ప్రమాణాలు` (ఏయన్నార్, జమున, రాజ సులోచన) స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా హీరోహీరోయిన్లుగా నటించగా కైకాల సత్యనారాయణ, అలీ, సాక్షి రంగారావు, గిరిబాబు, శివపార్వతి, నిర్మలమ్మ, చలపతి రావు, ఝాన్సీ, గౌతమ్ రాజు, బండ్ల గణేశ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతమందించిన ఈ చిత్రానికి `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, భువనచంద్ర సాహిత్యమందించారు. పాటల్లో ``దేవతలారా రండి మీ దీవెనలు అందించండి`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``మిన్సారే మిన్సారే``, ``పందిరి వేసిన ఆకాశానికి``, ``హాయ్ హాయ్ నాయికా``, ``శ్రీరస్తు శుభమస్తు``, ``నీ మనసులో మాట``, ``మనసా`` గీతాలు కూడా రంజింపజేశాయి. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించిన `ఆహ్వానం`.. 1997 మే 2న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ కుటుంబ కథా చిత్రం పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |