![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా మొదటి వీకెండ్ పూర్తి చేసుకుంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 29 న విడుదలై దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రూ.50 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైర్స్ తో కలిపి 29.50 కోట్ల షేర్ రాబట్టిన ఆచార్య రెండో రోజు 5.15 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మూడో రోజు ఆదివారం అయినప్పటికీ 4.07 కోట్ల షేర్ కే పరిమితమైంది. మూడు రోజుల్లో ఈ సినిమా నైజాంలో 11.56 కోట్లు(బిజినెస్ 38 కోట్లు), సీడెడ్ లో 5.87 కోట్లు(బిజినెస్ 18.50 కోట్లు), ఆంధ్రాలో 21.29 కోట్ల(బిజినెస్ 51 కోట్లు) షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 107.50 కోట్ల బిజినెస్ చేసిన ఆచార్య మూడు రోజుల్లో 38.72 కోట్ల(55.90 కోట్ల గ్రాస్) మాత్రమే రాబట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లకు 50 కోట్లకు పైగా నష్టం మిగిల్చే అవకాశముంది అంటున్నారు. అలాగే మూడు రోజులకు గానూ కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 2.45 కోట్లు(బిజినెస్ 11.70 కోట్లు), ఓవర్సీస్ 4.35 కోట్లు(బిజినెస్ 12 కోట్లు) రాబట్టింది.
వరల్డ్ వైడ్ గా 131.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య.. మొదటి రోజు 35.05 కోట్ల షేర్(52 కోట్ల గ్రాస్), రెండో రోజు 6.02 కోట్ల షేర్(10.85 కోట్ల గ్రాస్), మూడో రోజు 4.45 కోట్ల షేర్(7.80 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. మూడు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 45.52 కోట్ల షేర్(70.65 కోట్ల గ్రాస్) సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 86 కోట్ల దూరంలో ఉంది.
![]() |
![]() |